అప్పుల బాధలతో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-21T05:22:01+05:30 IST
young man suicide

బాల్కొండ, డిసెంబరు20: మండలకేంద్రానికి ఉల్లేశ్వర్ ప్రవీ ణ్‌కుమార్(32) అప్పుల బాధలు తాళలేక, కుటుంబ పోషణ భారం కావడంతో జాతీయ రహదారి పక్కన గల నీటి గుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్.ఐ. శ్రీ హరి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్‌కుమార్ ఆర్మూ ర్‌లో అవుసలి వృత్తి చేస్తున్నాడు. కరోనా కారణంగా పని నడవక కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రవీణ్ కు మార్ తరచూ అప్పులు ఎలా తీర్చాలనే బాధతో భార్యతో పలుమార్లు గొడవపడ్డాడు. ఈనెల 18న ఉదయం ఆర్మూ ర్ బంగారు దుకాణం వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేడు. భార్య ఫోన్ చేసి నా స్విచ్చఫ్ రావడంతో పలుచోట్ల వెతికారు. 20న తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం పక్కన గల నీటి గుం టలో గుర్తు తెలియని మృతదేహం ఉం దన్న సమాచారంతో బంధువులతో కలిసి వెళ్లి చూడగా ప్రవీణ్‌గా గుర్తించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
క్రిమిసంహారక మందు తాగి ఒకరి..
వర్ని : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో ఆదివారం క్రిమిసంహారక మందు తాగి బంగారి రమేష్(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకనే రమేష్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
పెంటకలాన్‌లో అంగన్వాడీ టీచర్ మృతి
బోధన్ రూరల్ : బోధన్ మండలంలోని పెంటకలాన్‌లోలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న పద్మ ఆదివారం మృతి చెందింది. పద్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతిచెందినట్టు గ్రామస్థులు తెలిపారు.