కామారెడ్డి జిల్లాలో 30వ యాక్టు అమలు
ABN , First Publish Date - 2020-12-02T05:00:42+05:30 IST
జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉందని ఎస్పీ శ్వేతా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కామారెడ్డి, డిసెంబరు 1: జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉందని ఎస్పీ శ్వేతా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సభలు, సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే ముందుగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని పోలీసుల అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ప్రజలు పోలీసులకు సహక రించాలని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబరు 1 నుంచి 31 వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు.