జాతీయ రహదారిపై ఆటో బోల్తా
ABN , First Publish Date - 2020-05-13T07:26:52+05:30 IST
కరో నా వైరస్ ప్రభావంతో పని దొరక్క పొట్ట చేత పట్టుకొని తమ స్వరాష్ట్రాలకు బయలుదేరిన వల సకులీల బతుకులు రోడ్డు

21 మందికి తీవ్ర గాయాలు
చికిత్స పొందుతూ ఒకరి మృతి
ఐదుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్‌కు తరలింపు
టైరు పేలడంతో ఘటన
కామారెడ్డిటౌన్ /సదాశివనగర్, మే 12: కరో నా వైరస్ ప్రభావంతో పని దొరక్క పొట్ట చేత పట్టుకొని తమ స్వరాష్ట్రాలకు బయలుదేరిన వల సకులీల బతుకులు రోడ్డు ప్రమాదంలో చిద్రమ య్యాయి. పోలీసులు, బాధితులు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని నిర్మాణ రంగానికి చెందిన ఓ కంపెనీలో జార్ఖండ్‌లోని గ డ్వల్ జిల్లాకు చెందిన కూలీలు పని చేసుకుంటు న్నారు. లాక్‌డౌన్‌తో పనులు నిలిపోవడంతో సొం తూరుకు బయలు దేరారు. మార్గమధ్యలో టాటా మ్యాజిక్ ట్రాలీ వాహనాన్ని 21 బంది కూలీలు ఎక్కారు.
44వ జాతీయ రహదారిపై కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి వద్ద ఆటో టైర్ పేలి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 21 మంది వలసకులీలు గాయపడ్డారు. వారిని చి కిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుదేశ్వర్ రాం(33) మృతి చెందాడు. తీవ్రంగా గాయనడ్డ అవదీష్, బీహరిరాం, సంజయ్‌రాం, అంబ్రీష్, బీ నారాం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరా బాద్‌కు తరలించారు.
ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి క్షతగాత్రులను పరామర్శించి సంఘటన వివ రాలను తెలుసుకున్నారు. అంతకముందు సదా శివనగర్ సీఐ వెంకట్, ఎస్‌ఐ నరేష్ బాధిత కా ర్మికులకు మెరుగైన వైద్యం అందేలా చూడడంతో పాటు విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేశారు.