రోజుకు 2వేల టెస్టులు

ABN , First Publish Date - 2020-08-22T10:33:18+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి పెరగడంతో జిల్లా యంత్రాం గం అప్రమత్తమైంది. శుక్రవారం నుంచి ఎక్కువ టెస్టు లు చేసేందుకు చర్యలు చేపట్టింది

రోజుకు 2వేల టెస్టులు

జిల్లాలో కరోనా ప్రభావం పెరగడంతో ప్రతిరోజూ రెండువేల పరీక్షలు

శుక్రవారమే ప్రారంభించిన యంత్రాంగం

పీహెచ్‌సీకి 50 టెస్టుల టార్గెట్‌

అవసరమైన వారికి చికిత్స కోసం ఏర్పాట్లు


నిజామాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

జిల్లాలో కరోనా ఉధృతి పెరగడంతో జిల్లా యంత్రాం గం అప్రమత్తమైంది. శుక్రవారం నుంచి ఎక్కువ టెస్టు లు చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల కు అనుగుణంగా అన్ని పీహెచ్‌సీలకు కిట్లను పంపించి ప్రతీరోజు రెండు వేల టెస్టులు చేసేందుకు పీహెచ్‌సీల వారీగా టార్గెట్‌లు ఇచ్చారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి అవసరం అయిన చికిత్స అందించేందుకు ఆసు పత్రులతో పాటు ఐసోలేషన్‌ కేంద్రాలలో ఏర్పాట్లు చేశా రు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి కూడా అన్ని రకా ల మందులు అందిస్తుండగా తాజాగా కౌన్సెలింగ్‌ ఇచ్చేoదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో కరోనా ప్ర భావం బాగా పెరిగి వైరస్‌ గ్రామస్థాయి వరకు వ్యాపిం చడంతో టెస్టుల సంఖ్యను పెంచారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, జనరల్‌ ఆసుపత్రిలో టార్గెట్‌కు అనుగుణ ంగా శుక్రవారం నుంచి పరీక్షలు చేస్తున్నారు. జిల్లా అం తటా కలిపి ప్రతిరోజు రెండు వేల టెస్టులు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి పీహెచ్‌సికి కనీసం 50 మ ందికి టెస్టులు చేయాలని టార్గెట్‌ ఇచ్చారు. జిల్లా కేం ద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలోను ఇప్పటి వరకు 100 మందికి పరీక్షలు చేస్తుండగా ప్రస్తుతం రెండు వందల కు పెంచారు. జిల్లాలో గడిచిన కొన్ని రోజులుగా ప్రతి రోజు 90 నుంచి వంద వరకు కేసులు వస్తున్నాయి.


గ్రామీణ పీహెచ్‌సీల నుంచి జనరల్‌ ఆసుపత్రి వరకు కే సులు పెరుగుతుండటంతో ప్రతిరోజు రెండు వేల వర కు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఎక్కువ గా పనులలో ఉండే వ్యాపారులు, కిరాణ దుకాణాల యజమానులు, డ్రైవర్లు, కూలీలు, ఉద్యోగులు, పనుల లో బిజీగా ఉండే వారందరికీ పరీక్షలు చేయనున్నారు. ప్రతీ గ్రామం పరిధిలో జ్వరాలు ఉన్న వారిని గుర్తించి ఈ టెస్టులు చేసేందుకు ఏర్పాట్లను చేశారు. అవసరమై న గ్రామాలలో క్యాంపులాగా ఏర్పాటు చేసి టెస్టులు చే యనున్నారు. ఎక్కువ మందికి టెస్టులు చేయడం వల్ల కేసులు త్వరగా బయటపడనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో తప్పనిసరి చే సేందుకు ఈ టార్గెట్‌లను ఇచ్చారు. జిల్లాలో టెస్టుల సంఖ్య పెంచడం వల్ల కేసుల సంఖ్య మరింత పెరు గనుంది. ఎక్కువ కేసులు రానుండడంతో అవ సరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.


జిల్లా జనరల్‌ ఆసుపత్రితో పాటు ఆర్మూర్‌, బోధన్‌ ఆసుపత్రులలో పడకలను సిద్ధ్ద ం చే స్తున్నారు. అవసరమైతే ఐ సోలేషన్‌ కేంద్రాలకు పంపిం చి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉ న్నవారికి కూడా మందులను అందివ్వ డంతో పాటు అ వసరమైన సమయంలో చికిత్స అందే విధంగా సిబ్బం దిని సిద్ధ్దం చేస్తున్నారు. టెస్టుల సంఖ్య పెంచడం వల్ల కలెక్టర్‌ ఆర్మూర్‌ మండలం పరిధిలో పరిశీలించారు. జి ల్లాలో ఎవరికీ ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ టెస్టుల సంఖ్యను పెంచామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రతి పీహెచ్‌సీకి వచ్చిన వారికి ఈ పరీక్షలు చేస్తామన్నారు. కరోనా వచ్చిన వారికి చికిత్స అందిస్తు న్నామన్నారు. జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో అన్ని ఏర్పా ట్లు ఉన్నాయన్నారు. వెంటిలేటర్లతో పాటు ఆక్సిజన్‌ సౌ కర్యం ఉందన్నారు. మందులన్నీ అందుబాటులో ఉన్నా యన్నారు. ఎవరు ఆందోళన చెంద వద్దని బయటికివస్తే తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని కలెక్టర్‌ కోరారు.


జిల్లాలో మరో 286 కరోనా కేసులు 

నిజామాబాద్‌(ఆంధ్ర జ్యోతి ప్రతినిధి)/ ఆర్మూర్‌/బోధన్‌: జిల్లాలో శుక్రవారం కొత్తగా మరో 286 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,079కి చేరిందన్నారు. ఇందులో 1,204 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు చికిత్స పొంది 875 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు మొ త్తం 83 మంది మృతిచెందినట్టు అధికారులు తె లిపారు. ఇందల్వాయి మండలంలో నలుగురికి, ధర్పల్లి మండలంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చిన ట్లు వైద్యులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్య క్తిని ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌గా గుర్తించారు. సి రికొండ మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్‌ మోహన్‌ లాల్‌ తెలిపారు. అ లాగే డిచ్‌పల్లి మండలంలోని ధర్మారంలో 20మందికి టెస్ట్‌లు చేయ గా 18మందికి నెగిటివ్‌, ఇద్దరికి పాజిటివ్‌ రావ డం జరిగిందని వైద్యాదికారి బాబురావు, సూపర్‌ వైజర్‌ శంకర్‌ తెలిపారు. 


బోధన్‌ డివిజన్‌లో..

బోధన్‌లో శుక్రవారం 18 కరోనా పాజిటివ్‌ కే సులు నమోదయ్యాయి. బోధన్‌ జిల్లా ఆసుపత్రి లో ఆరు, రాకాసీపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ లో ఎనిమిది, పాన్‌గల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంట ర్‌లో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు అధికారు లు తెలిపారు. అలాగే బోధన్‌ మండలంలోని సా లూర, పెగడాపల్లి పీహెచ్‌సీలో 56 కరోనా పరీక్ష లు నిర్వహించగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చి ందని తెలిపారు. అదే విధంగా కోటగిరి మండల ంలో తొమ్మిది, నవీపేట మండలంలో ఎనిమిది క రోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందు లో నవీపేట మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ, ఓ దినపత్రిక విలేకరి ఉన్నారని వైద్యాధికారులు తెలిపారు. అదే విధంగా ఎడపల్లి మండలంలో ఎనిమిది, వర్నిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చి నట్టు అధికారులు తెలిపారు.  


ఆర్మూర్‌ డివిజన్‌లో 

ఆర్మూర్‌లో 30మందికి కరోనా పాజిటివ్‌ వచ్చి నట్టు వైద్యులు తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వ హించిన టెస్టులలో మామిడిపల్లికి చెందిన నలు గురికి, ఆర్మూర్‌ పాతబస్టాండ్‌కు ఒకరికి, బు స్సాపూర్‌కు చెందిన ఒకరికి పాజి టివ్‌ వచ్చిందని తెలిపారు. అ లాగే జక్రాన్‌పల్లి మండలంలోని వివి ధ గ్రామాలకు చెందిన 21మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు మండల వైద్యాధికారి ర ఘువీర్‌గౌడ్‌ తెలిపారు. మోర్తాడ్‌ మండలంలో ఐ దుగురికి పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్‌లు సుమం త్‌, రవికుమార్‌ తెలిపారు. మెండోర, పోచంపాడ్‌ పీహెచ్‌సీ పరిధిలో 16కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాల్కొండ మండలంలోని కి సాన్‌నగర్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 82 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఏ డు కరోనా పాజిటివ్‌ నమోదు అయినట్టు డాక్టర్‌ రవిశంకర్‌ తెలిపారు. నందిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 20మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గతంలో కరోనా పాజిటివ్‌ వ చ్చిన ప్రభుత్వ అటెండర్‌ మృతి చెందినట్టు వై ద్యులు తెలిపారు. వేల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 83 మందికి కరోనా ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా వేల్పూర్‌ తహసీల్దార్‌తో పాటు 23మందికి కరో నా పాజిటివ్‌ వచ్చినట్టు పీహెచ్‌సీ వైద్యులు అశో క్‌, వెంకటరమణ తెలిపారు. భీమ్‌గల్‌ మండలం లో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్టు డా క్టర్‌ అజయ్‌పవర్‌ తెలిపారు.

Updated Date - 2020-08-22T10:33:18+05:30 IST