బడాపహడ్‌లో 17 మందిపై వేటు!

ABN , First Publish Date - 2020-03-04T11:24:22+05:30 IST

వర్ని మండలం బడాప హాడ్‌ పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆకస్మీక తనిఖీ లు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 25 మంది వక్ఫ్‌బోర్డు ..

బడాపహడ్‌లో 17 మందిపై వేటు!

బడాపహాడ్‌లో అదనపు కలెక్టర్‌ తనిఖీలు

భక్తుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

17 మంది వక్ఫ్‌బోర్డు సిబ్బంది సస్పెన్షన్‌కు ఆదేశాలు 


వర్ని, మార్చి 3: వర్ని మండలం బడాప హాడ్‌ పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆకస్మీక తనిఖీ లు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 25 మంది వక్ఫ్‌బోర్డు సిబ్బంది విధుల్లో ఉండాల్సి ఉండ గా 17మంది తమ విధులు నిర్వర్తించకపోవ డంతో వారిపై సస్పెన్షన్‌ చర్యల కోసం వక్ఫ్‌ బోర్డు సీఈవోను ఆదేశించారు. భక్తులను ని లువు దోపిడీకి గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అదనపు కలెక్టర్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించకపో గా ఇష్టారాజ్యంగా బడాపహాడ్‌లో కార్యకలా పాలు నిర్వహిస్తున్నారని భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదంటూ అదనపు కలెక్టర్‌ మండిపడ్డారు. భక్తుల నుంచి అక్రమ వసూళ్లుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బడాపహాడ్‌లో పారిశుధ్య లో పంపై మండిపడ్డారు. పరిసరాల పరిశుభ్రత కు చర్యలు తీసు కోవాలని వక్ఫ్‌బోర్డు అధికా రులను రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించా రు. ఆయనవెంట వక్ఫ్‌బోర్డు అధికారులు, సి బ్బంది, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Updated Date - 2020-03-04T11:24:22+05:30 IST