14 నుంచి పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-12T05:18:02+05:30 IST

ఈ ఏడాది కొత్తగా పశువులకు నట్టల నుంచి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నట్టల నివారణ కోసం ప్రత్యేక చికిత్స ప్రారంభించనుంది.

14 నుంచి పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ

తాడ్వాయి, డిసెంబరు 11: ఈ ఏడాది కొత్తగా పశువులకు నట్టల నుంచి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నట్టల నివారణ కోసం ప్రత్యేక చికిత్స ప్రారంభించనుంది. గతంలో నట్టల నివారణ మందు గొర్రెలు, మేకలకు మాత్రమే అందించేది. ఈ సారి ప్రత్యేకంగా పాడి పశువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆవులు, గేదెలకు నట్టల నివారణ మందులు అందించి చికిత్సలు నిర్వహించా లని సంకల్పించారు. గొర్రె లు, మేకలకు పూర్తిస్థాయిలో 100 శాతం రాయితీపై నట్టల నివారణ మందులు అందించినట్లు ఆవులు, గేదె లకు సైతం అందించేందుకు ప్రభుత్వం  ప్రణాళికలు రూపొందించిం ది. అందులో భాగంగానే ఈనెల 14 నుంచి జిల్లాలో తెల్ల, నల్లజాతి పశువులకు నట్టల నివారణ మందు చికిత్సలు ప్రారంభం కానున్నా యని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. రైతులు తమ పశువులకు నట్టల నివారణ మందు మాత్రలు ఖచ్చితంగా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆవులు, గేదెల ప్రామాణికంగా వాటికి మాత్ర వేయడం జరుగుతుందని జిల్లాలో తెల్లజాతి పశువులు 1,12,160, నల్ల జాతి పశువులు 1,81,253 మొత్తం 2,93,413 ఉన్నాయి. అన్ని పశువు లకు నట్టల నివారణ మందులు అందించి పశువులకు నట్టల నుంచి రక్షించాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతులు ఈ చికిత్సలను విని యోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నట్టల నివారణ మందుల పంపిణీని సద్వినియోగం చేసుకోవాలి

రామచంద్రం, పశువైద్యాధికారి, తాడ్వాయి.
కొత్తగా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా తెల్లజాతి, నల్లజాతి పశువులకు సైత ం నట్టల నివారణ మందు చికిత్సను అందించ డానికి ప్రతే ్యక ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఈనెల 14 నుంచి నట్టల నివారణ మందుల పంపిణీ చేయడానికి కసర త్తు చేస్తున్నాం. రైతులు తమ పశువులకు ఖచ్చితంగా నట్టల నివా రణ మందులను వేయించాలి.

Updated Date - 2020-12-12T05:18:02+05:30 IST