యువకుడి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-12-05T05:54:33+05:30 IST

మండలంలోని పెద్దకందుకూరు వాగులో యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందడం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

యువకుడి అనుమానాస్పద మృతి


యాదాద్రి రూరల్‌, డిసెంబరు 4: మండలంలోని పెద్దకందుకూరు వాగులో యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందడం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.  ఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకందుకూర్‌ గ్రామానికి చెందిన గీస శరత్‌ (25) మూడు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు. గ్రామ సమీపంలోని వాగులో మృతదేహం మునిగి ఉండడాన్ని గ్రామస్థులు గమనించి, బయటికి తీసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.  జేబులో పాలబిల్లు ఇతర కార్డులు ఉండటంతో తమ గ్రామానికి చెందిన యువకుడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. శరత్‌ ఎలా మృతి చెందాడో తెలియడంలేదు. ఎవరైన కొట్టిచంపారేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. 

Updated Date - 2020-12-05T05:54:33+05:30 IST