ప్రజలు రాజకీయ మార్పును కోరుతున్నారు
ABN , First Publish Date - 2020-12-15T06:30:58+05:30 IST
తెలంగాణ ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారని, ఇందుకు ఇటీవలి దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని యువ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు.

యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్ట బాలకృష్ణారెడ్డి
భువనగిరి టౌన్, డిసెంబరు 14: తెలంగాణ ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారని, ఇందుకు ఇటీవలి దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని యువ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రాణి రుద్రమరెడ్డితో కలిసి ఆయన భువనగిరిలో సోమవారం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పాలనలో దగాకు గురవుతున్నారన్నారు. టీఆర్‌ఎ్‌సకు రాజకీయ ప్రత్యామ్నాయమే లక్ష్యంగా వచ్చే సాధారణ ఎన్నికల నాటికి యువ తెలంగాణను రాష్ట్రమంతటా బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. త్వరలో జరుగనున్న నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమ, అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమారపు శంకర్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి/ వలిగొండ : జిట్టా బాలకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా యువతెలంగాణ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము భానుచందర్ ఆధ్వర్యంలో భూదాన్‌పోచంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మాయిదేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిట్టా బాలకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. వలిగొండ మండలంలోని టేకుల సోమారం గ్రామంలోని సాధన మానసిక సంస్థలోని దివ్యాంగులకు యువ తెలంగాణ పార్టీ నాయకులు పండ్లను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు తినిపించుకున్నారు.