నల్గొండ : ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచిన యువకుడు

ABN , First Publish Date - 2020-07-19T02:37:44+05:30 IST

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంతో జనాల ప్రాణాలు పోతున్నాయి.

నల్గొండ : ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచిన యువకుడు

నల్గొండ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంతో జనాల ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానాలో కోవిడ్-19 వార్డులో ఆక్సిజన్ అందక ఓ యువకుడు తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల్లోకెళితే.. మాడుగులపల్లి మండలం సల్కునూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇవాళ ఉదయం ఆస్పత్రిలో చేరాడు. అయితే సరైన వైద్యం అందకపోవడం.. కనీసం ఆక్సిజన్ కూడా వైద్యులు పెట్టకపోవడంతో సాయంత్రం 6గంటలకు ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు.


ఇవాళే అతని నమునాలను తీసుకొని కోవిడ్-19 టెస్ట్‌కు పంపడం జరిగింది. అతను ఆస్పత్రిలో చేరినప్పట్నుంచి ఇవాళ ఉదయం వరకూ ఒక్క డాక్టర్‌ కూడా ఆస్పత్రిలో లేకపోవడం గమనార్హం. కనీసం ఒక్కరంటే ఒక్క డాక్టర్ కూడా చేయిపట్టుకుని చూసిన పాపాన పోలేదు. గత్యంతరం లేక బెడ్ మీదనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం.. ఆయన తల్లి బాటిల్‌తో నీళ్లు పోస్తూ కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాన్ని చూసిన జనాలు కంటతడిపెడుతున్నారు.

Updated Date - 2020-07-19T02:37:44+05:30 IST