యాసంగి పంటకు నీటిని సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-05T05:49:57+05:30 IST
పెండ్లిపాకల ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతులు యాసంగి పంటకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
కొండమల్లేపల్లి, డిసెంబరు 4: పెండ్లిపాకల ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతులు యాసంగి పంటకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏఎమ్మార్పీ డిస్ర్టిబ్యూటరీ డీ-7నుంచి వచ్చిన నీరు పెండ్లిపాకల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందన్నారు. ప్రస్తుతం ఉన్ననీటిని పెండ్లిపాకల, గుడితండా, వర్థమానిగూడెం, చింతకుంట్ల గ్రామాల 1800 ఎకరాల పరిధిలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వేణుధర్‌రెడ్డి, రేఖ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.