యాదాద్రిలో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ పూజలు

ABN , First Publish Date - 2020-05-11T10:02:15+05:30 IST

ప్రసిద్ధమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆన్‌లైన్‌ పూజలు కొనసాగుతున్నాయి.

యాదాద్రిలో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ పూజలు

యాదాద్రి టౌన్‌, మే 10: ప్రసిద్ధమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆన్‌లైన్‌ పూజలు కొనసాగుతున్నాయి. ఉదయం స్వామి అమ్మవార్లను సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించి హోమం, నిత్యకల్యాణోత్సవ పర్వాలు నిర్వహించారు. ఆన్‌లైన్‌ పూజల్లో భాగంగా నిజాభిషేకం పూజలు-3, నిత్యార్చనలు-5, నిత్య కల్యాణ పూజలు-1 భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా అర్చకులు భక్తుల పేరిట గోత్రనామాలతో పూజలు నిర్వహించారు.  అనుబంధ పాతగుట్ట ఆలయంలో కొండపైన శివాలయంలో నిత్యకైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు 200 మందికి నిత్యాన్నప్రసాద వితరణ కొనసాగింది 

Updated Date - 2020-05-11T10:02:15+05:30 IST