యాదాద్రీశుడి సన్నిధిలో కార్తీక ఆరాధనలు
ABN , First Publish Date - 2020-12-11T05:57:17+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో పవిత్ర కార్తీక మాసం చివరివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు
23 రోజుల హుండీఆదాయం రూ.94.64లక్షలు
యాదాద్రి టౌన్, డిసెంబరు 10: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో పవిత్ర కార్తీక మాసం చివరివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇష్టదైవాల దర్శనం ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని హరిహరుల ఆలయాల ఆవరణలో తులసిమాతను కొలుస్తూ మహిళా భక్తులు దీపారాధన చేపట్టారు. సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి దేవస్థాన విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో రూపొందించిన 2021-22 సంవత్సరం క్యాలెండర్‌ను ఈవో గీతా రెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి గురువారం ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు కోల అంజనేయులు ఉన్నారు. ఇదిలా ఉండగా స్వామికి భక్తులు హుండీల ద్వారా నవంబర్ 18నుంచి ఈనెల 10(23రోజులు) సమర్పించిన నగదు, నగల మొక్కుల కానుకల లెక్కింపులను గురువారం కొండపైన హరిత భవనంలో నిర్వహించారు. రూ.94,64,969ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరింది. ముడి బం గారం 147 గ్రాములు, వెండి 3కిలోల 200 గ్రాములు ఆలయ ఖజానాలో జమ అయినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం స్వామికి రూ.12,66,716ఆదాయం సమకూరినట్లు దేవస్ధాన అధికా రులు పేర్కొన్నారు. 597మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతపూజలో పాల్గొన్నారు.
యాదాద్రి రూరల్: యాదగిరిగుట్ట పరిధిలోని లోటస్ టెంపుల్‌లో శబరిమల సేవా సమితి ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకుడు శ్రీనివాస్, మునిసిపల్ చెర్‌పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.