యాదాద్రి క్షేత్రంలో వైభవంగా కార్తీక పూజలు

ABN , First Publish Date - 2020-12-03T05:59:22+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం కార్తీక మాసం సందర్భంగా దీపారాధనలు, సత్యనారాయణ స్వామి వ్రత పూజలు వైభవంగా జరిగాయి.

యాదాద్రి క్షేత్రంలో వైభవంగా కార్తీక పూజలు
బాలాలయంలో పూజలో పాల్గొన్న భక్తులు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం కార్తీక మాసం సందర్భంగా దీపారాధనలు, సత్యనారాయణ స్వామి వ్రత పూజలు వైభవంగా జరిగాయి. హరిహరులను దర్శించుకున్న భక్తులు కుటుంబసమేతంగా  సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహిళా భక్తులు ఆలయాల ఆవరణలో దీపారాధనలు చేపట్టారు. బుధవారం సుమారు 304 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామికి వ్రత పూజల ద్వారా రూ.1.52లక్షల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదాద్రీశుడికి నిత్యపూజా కైంకర్యాలు పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో జరిగాయి. అనుబంధ రామలింగేశ్వరుడికి నిత్య పూజలు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. స్వామికి బుధవారం భక్తుల నుంచి 10లక్షల 3వేల 877 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-12-03T05:59:22+05:30 IST