యాదాద్రిలో ఏకాంతంగా నిజాభిషేకం

ABN , First Publish Date - 2020-10-01T10:06:42+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యపూజా కైంకర్యాలు ఏకాంతంగా కొనసాగాయి.

యాదాద్రిలో ఏకాంతంగా నిజాభిషేకం

యాదాద్రి టౌన్‌, సెప్టెంబరు 30: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యపూజా కైంకర్యాలు ఏకాంతంగా కొనసాగాయి. బాలాలయంలో ఉత్సవమూర్తులను వేదమంత్రాలతో అభిషేకించి తులసిదళాలతో అర్చించారు. అనంతరం హోమం, నిత్యకల్యాణ వేడుకలు నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో, కొండపై చరమూర్తుల ఆలయంలో నిత్యపూజలు సంప్రయదాయరీతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.2,26,140 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. యాదాద్రి దేవస్థాన ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు బుధవారం పదవీ విరమణ పొందారు. సుమారు 40 ఏళ్లపాటు ఆయన యాదాద్రి దేవస్థానంలో అర్చకుడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, వివిధ పదవుల్లో స్వామివారి నిత్యసేవా కైంకర్యాలు జరిపించారు. నర్సింహాచార్యులను దేవస్థాన అర్చక, అధికార యంత్రాంగం అభినందించింది. 

Updated Date - 2020-10-01T10:06:42+05:30 IST