వరదలతో చండూరులో అధ్వానంగా రోడ్లు
ABN , First Publish Date - 2020-10-31T07:34:08+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద లకు మండలంలోని పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్డు ప్రక్కన ఉన్న కల్వర్టుల్లో ఇసుక పైకి లేచింది. రోడ్లలో పెద్ద పెద్ద గుంతలు

చండూరు, అక్టోబరు 30: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద లకు మండలంలోని పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్డు ప్రక్కన ఉన్న కల్వర్టుల్లో ఇసుక పైకి లేచింది. రోడ్లలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ టంతో ప్రయాణం చేయాలంటే వాహనదారులు ఇబ్బంది పడు తున్నారు. ప్రమాదభరితంగా ఉన్న ఈ రోడ్లలో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. వర్షాలు తగ్గినా రోడ్లను మరమ్మతు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.