కార్మికుల ఖాతా వివరాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-04-08T10:51:07+05:30 IST
జిల్లాలోని అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు గతంలో వెల్ఫేర్ బోర్డు నుంచి కార్డుపొంది

సూర్యాపేట(కలెక్టరేట్), ఏప్రిల్ 7: జిల్లాలోని అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు గతంలో వెల్ఫేర్ బోర్డు నుంచి కార్డుపొంది బ్యాంకు ఖాతా జతపర్చని వారు వెంటనే వారి బ్యాంకు ఖాతా వివరాలను కార్మిక శాఖ కార్యాలయంలో అందజేయాలని టీఆర్‌ఎస్ భవన నిర్మాణ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఒగ్గు వెంకన్న తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్‌లో భవన నిర్మాణ కార్మికుల వివరాలు సేకరించారు. కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేని కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేస్తున్నాయని తెలిపారు. సాయం పొందాలంటే బ్యాంకు ఖాతా వివరాలు ఖచ్చితంగా ఉండాలన్నారు. సమావేశంలో స ంఘం నాయకులు దాసరి శ్రీను, మల్సూర్, సయ్యద్, అనిల్, వెంకన్న, సైదులు పాల్గొన్నారు.