మహిళ రోడ్డు దాటుతుండగా
ABN , First Publish Date - 2020-12-28T05:38:24+05:30 IST
రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది.

ఢీకొట్టిన కారు
కేతేపల్లి, డిసెంబరు 27: రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికురాలైన బందా శౌరమ్మ కాలినడకన జాతీయరహదారి దాటుతుండగా హైదరాబా ద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వేగం గా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శౌరమ్మ ఎగిరి రోడ్డు పక్కకు పడిం ది. ఈ ఘటనలో శౌరమ్మ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు ఎడమ చేయి విరిగింది. సమాచారం అందుకున్న 108 అంబులెను సిబ్బంది శౌరమ్మను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టి వెళుతున్న కారును ఓ యువకుడు బైక్‌పై వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.