టిప్పర్‌ ఢీకొని మహిళ దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-28T05:27:33+05:30 IST

లారీ ఢీకొని మహిళ దుర్మరణం చెందిం ది. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం సమీపంలో ఆదివారం జరిగింది.

టిప్పర్‌ ఢీకొని మహిళ దుర్మరణం

చివ్వెంల, డిసెంబరు 27: లారీ ఢీకొని మహిళ దుర్మరణం చెందిం ది. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం సమీపంలో ఆదివారం జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన చిలక వెంకటేశ్వర్‌రావు తన కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం బైక్‌పై భార్య నాగమణి (37)తో కలిసి స్వగ్రామం మధిరకు బయలుదేరాడు. బీబీగూడెం సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుకవైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగమణి తీవ్రంగా గాయపడింది. 108 అంబులెన్స్‌లో సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెం దింది. వెంకటేశ్వర్‌రావుకు తీవ్ర గాయాలయ్యాయి. నాగమణికి కుమా ర్తె, కుమారుడు ఉన్నారు. భర్త వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్‌ తెలిపారు. 

మానవత్వం మరిచిన లారీ డ్రైవర్‌

బైక్‌ను ఢీకొన్న తర్వాత టిప్పర్‌ డ్రైవర్‌ తప్పించుకునే ప్రయత్నంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. టిప్పర్‌ నాగమణి కాళ్లపై నుంచి నుంచి పోనిచ్చాడు. దీంతో నాగమణి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి.  అయి నప్పటికీ తప్పించుకునే ప్రయత్నంలో అతివేగంగా వెళ్తుండగా స్థానికులు గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు 12కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత బండమీది చందుపట్ల వద్ద టిప్పర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. టిప్పర్‌ టైరుకు విరిగిన నాగమణి కాలు అతికి ఉంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  


ట్రాక్టర్‌ బోల్తా : వ్యక్తి మృతి

తుంగతుర్తి, డిసెంబరు 27: ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మొండికుంటతండాలో శనివారం రాత్రి జరి గింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగన్‌(40) తన వ్యవసాయ బావి వద్ద నుంచి ట్రాక్టర్‌ నడు పుకుంటూ ఇంటికి వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడడంతో అక్క డికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. జగన్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ తెలిపారు. 

ఆక్రమణదారులకు నోటీసులు

నడిగూడెం, డిసెంబరు 27: నడిగూడెం బస్టాండ్‌ను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసిన వారికి గ్రామపంచాయతీ నోటీసులు జారీ చేసింది. రాత్రికి రాత్రే దుకాణాలు ఏర్పాటు చేయడంతో గ్రామానికి మరికొందరు కర్రలు, తాళ్లు పాతి స్థలాన్ని కబ్జా చేసేందుకు సిద్ధమ య్యారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుండడంతో ఆక్రమణలు ఖాళీ చే యాలని కార్యదర్శి ఫరీద్‌ నోటీసులు జారీ చేశారు. వారంలోగా ఆక్రమణ దుకాణాలు ఖాళీ చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుం టామని సర్పంచ్‌ గడ్డం నాగలక్ష్మి తెలిపారు. 


Updated Date - 2020-12-28T05:27:33+05:30 IST