కొత్త పాలకవర్గం సబ్‌ మార్కెట్‌ను సాధించేనా?

ABN , First Publish Date - 2020-10-31T07:33:11+05:30 IST

చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి కొత్త పాలకవర్గాలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. వాటి పదవీకాలాన్ని పూర్తి చేసు కుంటున్నాయి

కొత్త పాలకవర్గం సబ్‌ మార్కెట్‌ను సాధించేనా?

మొదట స్థల సమస్య ఫ తర్వాత ్ల నిధులకు కొరత

నార్కట్‌పల్లిలో స్థలం కేటాయింపునకు అడుగులు



రేపు చిట్యాల మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంనార్కట్‌పల్లి, అక్టోబరు 30: చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి కొత్త పాలకవర్గాలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. వాటి పదవీకాలాన్ని పూర్తి చేసు కుంటున్నాయి. అయితే నార్కట్‌పల్లిలో సబ్‌మార్కెట్‌ యార్డుకు మాత్రం మోక్షం లభించటం లేదు. తాజాగా పదవీ స్వీకారం చేయబోతున్న కమిటీ సభ్యులు సబ్‌ మార్కెట్‌ను సాధిస్తారా? లేదా? అనే చర్చ మొదలైంది.


టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వరకు

 రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల ప్రభుత్వాల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినా నార్కట్‌పల్లిలో మాత్రం సబ్‌ మార్కెట్‌ యార్డు ఏర్పాటు కాలేదు. భారీగా పెరిగిన భూముల ధరలు, లభించని సర్కారు స్థలాలు, మార్కెటింగ్‌ శాఖ నిబంధనలు సబ్‌ మార్కెట్‌ యార్డు ఏర్పాటుపై అశలు అడుగంటాయి. అయితే సర్వే నెం.481లో, ఇతర ప్రభుత్వ భూముల్లో సబ్‌ మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల చేసిన ప్రకటన ఆశలు రేపింది.  


చిట్యాల పరిధిలో సబ్‌మార్కెట్‌గా నార్కట్‌పల్లి

 చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో నార్కట్‌పల్లి మండలం సబ్‌ మార్కెట్‌గా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న ప్పుడు నార్కట్‌పల్లిలో సబ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కృషి చేసినా ముందుకు సాగలేదు. తదనంతరం  కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి రావడంతో రెండు పాలకవర్గాలు ఏర్పాటైనా  సబ్‌ మార్కె ట్‌యార్డు ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందం గా మారింది. సబ్‌ మార్కెట్‌కు స్థల సేక రణ జరుగుతుందనే ప్రచారంతో నార్కట్‌ పల్లిలో  భూముల ధరలకు రెక్కలొచ్చాయి.  ఎక్కువ ధర చెల్లించి మార్కెట్‌ యార్డుకు స్థలం కొనుగోలుకు మార్కెటింగ్‌ శాఖ నిబంధనలు అడ్డొచ్చాయి. దీంతో  రెండు పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా నార్కట్‌ పల్లిలో సబ్‌ మార్కెట్‌ కమిటీ ఏర్పాటు కాలేదు. నవంబరు ఒకటో తేదీ  కొత్త పాలకవర్గం కొలువు తీరనున్న నేపథ్యంలో  సబ్‌ మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు అడుగు ముందుకు పడుతుందా? లేదా? అన్న విషయం వేచిచూడాల్సిందే. 


నార్కట్‌పల్లిలోసర్వే నెం.481లో అసైన్డ్‌ భూమిని అధికారులు పరిశీలిం చారు. గోపలాయపల్లి గుట్టకు వెళ్లే ఆర్చి ఎదురుగా ఉన్న ఈ స్థలం గ్రామానికి దూరంగా ఉందని అప్పట్లో వద్దనుకున్నారు. ఈ భూమిలో కొంత స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయించారు. కొంత స్థలంలో ఇటీవల వైకుంఠధామం నిర్మించారు. మిగిలిన స్థలాన్ని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలతో  పాటు సబ్‌  మార్కెట్‌ యార్డుకు కేటాయించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. సబ్‌ మార్కెట్‌ యార్డు కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.


ప్రయోజనాలు అనేకం

నార్కట్‌పల్లిలో సబ్‌మార్కెట్‌ ఏర్పాటైతే మండల రైతులకు ప్రయోజనం కలగనుంది. మండలంలో 10 వేల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తు న్నారు. పండించిన ధాన్యానికి ధర తక్కువ ఉన్నా, ప్రభుత్వ మద్దతు ధర నచ్చక పోయినా  మార్కెట్‌ గోడౌన్‌లో ఆరు నెలల సరుకు భద్రపర్చుకుని పంట ధరలో 75 శాతం వడ్డీలేని రుణాన్ని పొందవచ్చు.  ఎక్కువ  ధర వచ్చినప్పుడు  అమ్ముకోవచ్చు. గోడౌన్‌లో భద్రపర్చిన సరుకుకు బీమా పొందవచ్చు.


 సబ్‌ మార్కెట్‌ యార్డు సాధిస్తాం

ఎమ్మెల్యే  చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మంత్రి  జగదీశ్‌రెడ్డి సహకారంతో, మార్కెట్‌ కమిటీ సభ్యుల మద్దతుతో నార్కట్‌పల్లికి సబ్‌ మార్కెట్‌ యార్డు తీసుకువస్తాం. నార్కట్‌పల్లి మండల రైతులకు అండగా నిలబడతాం.

కొండూరు శంకరయ్య, చిట్యాల మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌

Updated Date - 2020-10-31T07:33:11+05:30 IST