గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం : చిరుమర్తి
ABN , First Publish Date - 2020-12-28T05:51:12+05:30 IST
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

నకిరేకల్, డిసెంబరు 27: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నెల్లిబండ గ్రామంలో ఎస్‌డీఎఫ్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్‌లోని మినీ స్టేడియంలో రూ.10 లక్షలతో వాకింగ్ ట్రాక్, లైటింగ్, సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, చిన్నారుల క్రీడాసామగ్రి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా మండలంలోని నోముల గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్లాంపూర్ గ్రామానికి పలువురు టీఆర్‌ఎ్‌సలో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, చింతల సోమన్న, సకినాల రవి, ఖాసీంఖాన్, వీర్లపాటి రమేష్, రాచకొండ వెంకన్న, యల్లపురెడ్డి సైదిరెడ్డి, భీమనబోయిన లింగరాజు, మంగినపల్లి రాజు, గుర్రం గణేష్ పాల్గొన్నారు.