నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
ABN , First Publish Date - 2020-12-29T05:18:37+05:30 IST
తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.

అర్వపల్లి/ తిరుమలగిరి రూరల్, డిసెంబరు 28: తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. అర్వపల్లి మండలంలోని తిమ్మాపురంలో పశువైద్యశాలకు, లోయపెల్లిలో చెక్‌డ్యాంకు జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికయుగేందర్‌రావు కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎం పీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు. తిరుమలగిరి మండలం జేత్యతండాలో అంగన్‌వాడీభవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.