భార్య చేతిలో భర్త హతం

ABN , First Publish Date - 2020-12-19T06:04:46+05:30 IST

భర్తను భార్య హత్య చేసింది. శుక్రవారం మిర్యాలగూడ మండలంలోని లావూడితండాల పరిధిలోని తులసీతండాలో ఈ ఘటన జరిగింది.

భార్య చేతిలో భర్త హతం

 మిర్యాలగూడ మండలం లావూడితండాల పరిధిలోని తులసీతండాలో ఘటన

మిర్యాలగూడ రూరల్‌, డిసెంబరు 18: భర్తను భార్య హత్య చేసింది. శుక్రవారం  మిర్యాలగూడ మండలంలోని లావూడితండాల పరిధిలోని తులసీతండాలో  ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తులసీతండాకు చెందిన ధనావత్‌ రాజు(29) తీవ్రగాయాలతో తన ఇంటి వెనుకాల  మృతి చెందాడు.  సమాచారం అందుకున్న  డీఎస్పీ వై.వెంకటేశ్వర్‌ రావు, వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, రూరల్‌ ఎస్‌ఐ పరమేష్‌  తండాకు వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించగా రాజు ఒంటిపై గొడ్డలి వేట్లు, కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  రాజు మద్యానికి బానిస అయినందున  దంప తుల మధ్య  ఘర్షణలు జరుగుతున్నాయి. రాజును హత్య చేసినట్లు భార్య బుల్లి అంగీకరించింది. రాజు హత్యకు ఇతర కారణాలు ఉన్నాయా? భర్తను హత్య చేయడానికి భార్య బుల్లికి ఎవరైనా సహకరించారా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సదా నాగరాజు తెలిపారు.


Read more