పీసీసీ పదవి ఎవరికిచ్చినా ఐక్యంగా పనిచేస్తాం

ABN , First Publish Date - 2020-12-15T05:35:34+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇచ్చినా ఐక్యంగా పనిచేస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.

పీసీసీ పదవి ఎవరికిచ్చినా ఐక్యంగా పనిచేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి

తుంగతుర్తి, డిసెంబరు 14 : కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇచ్చినా ఐక్యంగా పనిచేస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో విలేకరులతో సోమవారం మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలు పనిచేస్తున్నాయని అన్నారు. దేశంలో లౌకిక పార్టీ అయన కాంగ్రెస్‌ పార్టీని బలహీన పరచడానికి ఎంఐఎం పార్టీని ఎన్నికల్లో పోటీలో నిలిపేందుకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం పార్టీ మోదీ ఇంటర్నల్‌ మిషన్‌గా పనిచేస్తుందని అన్నారు. కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, ఏకాంత సమావేశాలకు దేనికి సంకేతమన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, మండలాధ్యక్షుడు కిషన్‌రావు, అజయ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:35:34+05:30 IST