త్వరలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం : బీజేపీ

ABN , First Publish Date - 2020-12-26T04:28:23+05:30 IST

గుర్రంబోడుతండా బాధిత రైతులతో కలిసి త్వరలో ప్రగతిభవన్‌ను బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడిస్తానని పార్టీ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ ధరావత్‌ రవీందర్‌నాయక్‌ అన్నారు.

త్వరలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం : బీజేపీ

మఠంపల్లి, డిసెంబరు 25: గుర్రంబోడుతండా బాధిత రైతులతో కలిసి త్వరలో ప్రగతిభవన్‌ను బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడిస్తానని పార్టీ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ ధరావత్‌ రవీందర్‌నాయక్‌ అన్నారు. గుర్రంబోడుతండాలోని సర్వేనంబర్‌ 540లో గిరిజనులు సాగు చేస్తున్న భూములను రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు భోబ్బ భాగ్యరెడ్డి, బాల వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, చంద్రారెడ్డి, అడ్వకేట్‌లు భూక్య కృష్ణానాయక్‌, ఇస్లావతు బాలాజీనాయక్‌, వెంకటరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-26T04:28:23+05:30 IST