మేమూ శానిటైజర్స్‌ తయారుచేస్తాం

ABN , First Publish Date - 2020-03-30T11:15:46+05:30 IST

కరోనా నేపథ్యంలో శానిటైజర్లకు డిమా ండ్‌ పెరగడ ంతో ఉద్దీపన శానిటైజర్ల తయారీకి అధికారులు తమకు

మేమూ శానిటైజర్స్‌ తయారుచేస్తాం

నార్కట్‌పల్లి, మార్చి29: కరోనా నేపథ్యంలో శానిటైజర్లకు డిమా ండ్‌ పెరగడ ంతో ఉద్దీపన శానిటైజర్ల తయారీకి అధికారులు తమకు అనుమతి ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. అధికా రులు ఆర్డరిస్తే త్వరగా తయారు చేసి అందిస్తామని పేర్కొం టున్నారు. కరోనా వ్యాధిని అరికట్టే ప్రాథమిక చర్యల్లో హ్యాండ్‌వాష్‌ శానిటైజర్లదే ప్రధాన పాత్ర. దీంతో మార్కెట్లలో బ్రాండెడ్‌ హ్యాండ్‌వాష్‌ శానిటైజర్ల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్‌ నుంచి అవి సరఫరా అయ్యేందుకు సమయం పట్టనుంది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఉంచిన ఐసోలేషన్‌ వార్డులు, క్వారంటైన్లలో శానిటైజర్లను ప్రభుత్వమే సమకూరుస్తోంది. కాని ప్రజలకు సైతం వీటి అవసరం ఎంతైనా ఉంది.


బ్రాండెడ్‌ స్థాయిలో నాణ్యత కలిగిన ‘ఉద్దీపన’ శానిటైజర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చైర్మన్‌గా ఉన్న ఉద్దీపన కింద ని యోజకవర్గంలోని కొందరు మహిళలు వీటి తయారీపై శిక్షణ పొందారు. గ్రూ పులుగా ఏర్పడి ఇంటి వద్దే తయారు చేస్తున్నారు. అయితే మార్కెట్‌లోని ప లు ప్రముఖ కంపెనీల శానిటైజర్లతో పోటీపడే సామర్థ్యం లేక తక్కువ పరి మాణంలో తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ఉద్దీపన కింద వీటిని తయారు చేస్తున్న మహిళలను అధికార యం త్రాంగం ప్రోత్సహిస్తే ఎక్కువ పరిమాణంలో తయారు చేసే అవకాశం ఉంది. 


ఆర్డర్‌ ఇస్తే తయారు చేస్తాం 

అధికారులు ప్రోత్సహించి హ్యాండ్‌వాష్‌ శానిటైజర్లను ఆర్డర్‌ ఇస్తే తయారు చేస్తాం. వీటి తయారీపై రాజేంద్రనగర్‌లో శిక్షణ పొందాం. బ్రాండెడ్‌తో సమానంగా ఇవి పనిచేస్తున్నాయని వినియోగదారులు చెప్పారు. కాకపోతే మార్కెట్‌లో బ్రాండెడ్‌కు ఉన్న క్రేజ్‌ ఉద్దీపన శానిటైజర్లకు లేకపోవడంతో డిమాండ్‌ మేరకే తయారు చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రోత్సహించి మాకు ఆర్డ్డర్‌ ఇస్తే తయారు చేసిస్తాం. 

- గాయం మణెమ్మ, తయారీదారు, నార్కట్‌పల్లి

Updated Date - 2020-03-30T11:15:46+05:30 IST