అధికారి నిర్లక్ష్యంతోనే అనర్హత

ABN , First Publish Date - 2020-11-19T05:53:39+05:30 IST

తమ అనర్హత వేటుకు కారణమైన అధికారులపై చర్య లు తీసుకోవాలని కోరుతూ 40మంది వార్డు సభ్యులు(నలుగురు ఉప సర్పంచ్‌) ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.

అధికారి నిర్లక్ష్యంతోనే అనర్హత
మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అనర్హత వేటుకు గురైన వార్డు మెంబర్లు

మర్రిగూడ, నవంబరు 18 : తమ అనర్హత వేటుకు కారణమైన అధికారులపై చర్య లు తీసుకోవాలని కోరుతూ 40మంది వార్డు సభ్యులు(నలుగురు ఉప సర్పంచ్‌) ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 జనవరి 21న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓడి న, గెలుపొందిన వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చు వివరాలు తెలపాలని ఎన్నికల కమిషనర్‌  నోటీసులు జారీ చేశారన్నారు. గెలిచిన 40మంది వార్డు సభ్యులు కలిసి ఎంపీడీవో శేషుకుమార్‌కు నివేదిక అందించామన్నారు. అధికారి నిర్లక్ష్యంతో తాము ఇచ్చిన నివేదికను సకాలంలో ఎన్నికల కమిషనర్‌కు పంపకపోవడంతో అనర్హత వేటుకు గురయ్యామన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారు లు స్పందించి ఎన్నికల్లో అయిన ఖర్చు వివరాలపై విచారించడం తో తమ అనర్హత వేటుకు కారణమైన అధికారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం చేసి ఎంపీడీవో రమే్‌షధీన్‌దయాల్‌కు వినతిపత్రం అందించారు. ఈ ఆరోపణలపై అప్పటి ఎంపీడీవో శేషుకుమార్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా గెలుపొందిన వార్డు సభ్యులు తమకు ఇప్పటివరకు ఎన్నికల ఖర్చు వివరాల నివేదికలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల కమిషనర్‌ వీరికి నోటీసులు జారీ చేసిందని, ఆ నోటీసులు సైతం వారికి అందించామన్నారు. వారు ఆ నోటీసుకు సంతకాలు సైతం పెట్టి ఎన్నికల ఖర్చు వివరాలు అందించలేదన్నారు.


Updated Date - 2020-11-19T05:53:39+05:30 IST