ఓటర్ల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-30T06:25:28+05:30 IST
ఓటర్ల జాబితాలపై ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఓటరు జాబితా పరిశీలకురాలు అనితారాజేంద్రన్ అన్నారు.

ఓటరు జాబితా పరిశీలకురాలు అనితారాజేంద్రన్
భువనగిరి రూరల్, డిసెంబరు 29: ఓటర్ల జాబితాలపై ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఓటరు జాబితా పరిశీలకురాలు అనితారాజేంద్రన్ అన్నారు. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఈఆర్‌వోలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓటర్ల నుంచి అందిన ఫారం 6, 7, 8, 8ఏ దరఖాస్తుల నమో దు, వాటి పరిష్కార తీరు తెన్నులను ఆమె పరిశీలించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను నమోదు చేసుకొని జనవరి 5లోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.