పల్లెలను ఆకుపచ్చగా తీర్చిదిద్దాలి : కలెక్టర్‌ పాటిల్‌

ABN , First Publish Date - 2020-09-01T08:54:11+05:30 IST

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించి పల్లెలను ఆకుపచ్చగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం ఆయన

పల్లెలను ఆకుపచ్చగా తీర్చిదిద్దాలి : కలెక్టర్‌ పాటిల్‌

తిరుమలగిరి(సాగర్‌) / హాలియా, ఆగస్టు 31 : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించి పల్లెలను ఆకుపచ్చగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంతో పాటు అల్వాల, తెట్టెకుంట గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం పనులు పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల న్నారు. హరితహారానికి ఇంకా మండలానికి ఎన్ని మొక్కలు అవసరం అవుతాయో అధికారులు తెలపాలన్నారు.


అల్వాలలో ఐదెకరాల్లో నాటిన బ్లాంక్‌ ప్లాంటేషన్‌, ఎనేస్టిక్‌ కాల్వల వెంట పెంచుతున్న మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సేకరిస్తున్న ప్రభుత్వ భూములకు ఎవరైన అడ్డుతగిలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా అనుముల మండలంలోని పాలెం, చింతగూడెం, పులిమామిడి గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వనాలను పరిశీలించారు.


ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్‌, జడ్పీటీసీ ఆంగోతు సూర్యభాషానాయక్‌, తహసీల్దార్‌ వినయ్‌కుమార్‌, ఎంపీడీవో యాదగిరి, ఆదర్శ రైతు రాం రెడ్డి, సర్పంచ్‌లు శ్రవన్‌కుమార్‌రెడ్డి, పాపిరెడ్డి, లింగయ్య, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. 


పనులు వేగవంతం చేయాలి  : ఇన్‌చార్జి జడ్పీ సీఈవో 

మిర్యాలగూడ రూరల్‌ : ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి జడ్పీ సీఈవో సీతాకుమారి అన్నారు. సోమవారం ఆమె ఎంపీడీవో అజ్మీరాదేవికతో మండలంలోని కొత్తగూడెం, హట్యాతండా, చిల్లాపురం గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణాల తీరు పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో  అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. 


Updated Date - 2020-09-01T08:54:11+05:30 IST