వైభవంగా లక్ష్మీ పూజలు

ABN , First Publish Date - 2020-11-21T06:11:25+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో లక్ష్మీ పూజలు శుక్రవారం వైభవంగా కొనసాగాయి.

వైభవంగా లక్ష్మీ పూజలు
ప్రత్యేక అలంకారంలో అమ్మవారు

యాదాద్రి టౌన్‌, నవంబరు 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో లక్ష్మీ పూజలు శుక్రవారం వైభవంగా కొనసాగాయి. బాలాలయంలో కవచమూర్తులను హారతితో నివేదించి ఉత్సవమూర్తులను తులసిదళాలు, కుంకుమలతో అర్చించారు. కల్యాణ మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహించారు. కవచమూర్తుల ను సువర్ణ పుష్పాలతో అర్చించి, సాయంత్రం ఆండాల్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవం నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలోనూ లక్ష్మీ పూజలు, స్వామికి సువర్ణ పుష్పార్చన కొనసాగాయి. స్వామివారికి భక్తుల నుంచి రూ,5,77,887 ఆదాయం సమకూరింది.

Read more