గ్రామాభివృద్ధిలో వ్యవసాయ రంగమే కీలకం

ABN , First Publish Date - 2020-11-25T05:57:17+05:30 IST

గ్రామాభివృద్ధిలో వ్యవసాయ రంగమే కీలకమని జిల్లా వ్యవసాధికారి అనురాధ అన్నారు.

గ్రామాభివృద్ధిలో వ్యవసాయ రంగమే కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి అనురాధ

 జిల్లా వ్యవసాయాధికారి అనురాధ

తుర్కపల్లి, నవంబరు 24: గ్రామాభివృద్ధిలో వ్యవసాయ రంగమే కీలకమని జిల్లా వ్యవసాధికారి అనురాధ అన్నారు. మండలంలోని సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పంటల సాగుపై మంగళ వారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సమావేశంలో మాట్లాడారు. నిజమాబాద్‌ జిల్లా అంకాపూర్‌  రైతులు చేపట్టిన సాగు పద్ధతులపై  ఈ నెల 18న క్షేత్ర సందర్శన చేసి చూశామని, దానిపై రైతుల అభిప్రాయాలను తెలసుకున్నారు. రైతులు పంటకు వేసే ఎరువుల్లో 75 శాతం కలుపు మొక్కలే గ్రహిస్తాయన్నారు. కాబట్టి రైతులందరూ అంకాపూర్‌ రైతుల తరహాలో కలుపు నివారణ పద్ధతులు పాటించాలని కోరారు. రైతులు వ్యాపార ధోరణితో సాగు చేపట్టాలన్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ కనుగునంగా పూల తోటలు, కూరగాయల సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. ఈసందర్భంగా రైతులు మాట్లా డుతూ సబ్సిడీపై విత్తనాలు అందుబాటులో ఉంచాలని, కూరగాయల సాగుకు భయముందని, కోతుల బెడదను నివారించాని కోరారు. నూ తన వ్యవ సాయ పద్ధతులు పాటించాలంటే కూలీల కొరత ఉందని, యాంత్రీక రణ వ్యవసాయ పనులను అందుబాటులోకి తేవాలన్నారు. నీటి పారుదలకోసం డ్రిప్‌, స్ర్పింక్లర్లు, ఫాంపాండ్స్‌ సౌకర్యాన్ని ప్రతి రైతుకూ కల్పించాలని కోరారు. సమావేశంలో సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్‌,  మండల రైతు సమన్వయ సమితి కన్వీనరు నర్సింహులు, ఏఓ దుర్గేశ్వరి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

 వాసాలమర్రిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి 

 దాతల సహకారంతో గ్రామంలో సీసీ కెమరాలను ఏర్పాటు చయడానికి కృషి చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుబాబు తెలిపారు.  వాసాలమర్రి గ్రామంలో సీసీ కెమరాల ప్రయోజనంపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.   

Updated Date - 2020-11-25T05:57:17+05:30 IST