పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-11-26T05:57:00+05:30 IST

ప్రకృతి వనాలను పూర్తిచేయాలని అదనవు కలెక్టర్‌ పద్మజారాణి ఆదేశించారు. పెన్‌పహాడ్‌ మండల ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవా రం సందర్శించారు.

పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తిచేయాలి
గరిడేపల్లిలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ పద్మజ

పెన్‌పహాడ్‌, నవంబరు 25: ప్రకృతి వనాలను పూర్తిచేయాలని అదనవు కలెక్టర్‌ పద్మజారాణి ఆదేశించారు. పెన్‌పహాడ్‌ మండల ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవా రం సందర్శించారు. ప్రకృతి వనాల్లో పనిచేస్తున్న కూలీలకు డబ్బుల చె ల్లింపును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజ యలక్ష్మి, డీపీవో యాదయ్య, ఎంపీడీవో వేణుమాధవ్‌, ఎంపీవో ఆంజనే యులు, ఏపీవో రవి తదితరులు పాల్గొన్నారు. గరిడేపల్లి మండల పరి షత్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మజ పాల్గొన్నారు. రైతువేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, షెడ్ల్‌ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను సెగ్రీగెషన్‌ షెడ్స్‌కు తరలించాలన్నారు. కార్యక్రమంలో డీపీవో యాదయ్య, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఎంపీపీ పెండెం సూ జాత, ఎంపీడీవో వనజ, ఏపీవో నగేష్‌ పాల్గొన్నారు. తిరుమలగిరి మండలంలోని కోట్యానాయక్‌తండాలో పల్లె ప్రకృతి వనంలో ఎంపీడీవో ఉమేష్‌చారి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ హైమావతి రామోజీ, ఎంపీవో మారయ్య, ఏపీవో కృష్ణ, ఉదయ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-26T05:57:00+05:30 IST