వామ్మో.. ఎలుగుబంటి
ABN , First Publish Date - 2020-12-30T06:00:54+05:30 IST
పట్టపగలు ఎలుగుబంటి సంచరిస్తోందని గ్రామస్థులు పరుగులుపెట్టారు. చివరకు వేషం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

వేషం అని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్న గ్రామస్థులు
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో ఘటన
కోతుల బెడద నివారణకు సర్పంచ్ వినూత్న ఆలోచన
త్రిపురారం, డిసెంబరు 29: పట్టపగలు ఎలుగుబంటి సంచరిస్తోందని గ్రామస్థులు పరుగులుపెట్టారు. చివరకు వేషం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో కోతులబెడద ఉంది. వీటిని కట్టడి చేయ డానికి సర్పంచ్ బాలరాణి బాయికి వినూత్న ఆలోచన వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బందిలోని ఒకరితో ఎలుగుబంటి వేషం వేయించారు. ఎలు గుబంటి వేషంతో గ్రామంలోని వీధుల్లో తిప్పుతున్నారు. దీంతో కోతులు భయపడి పరారవుతున్నాయని సర్పంచ్ తెలిపారు.
ఎలుగుబంటి వేషంలో ఉన్న వ్యక్తి