లక్ష్యానికి దూరంగా ‘పట్టణ ప్రగతి’

ABN , First Publish Date - 2020-03-13T12:06:45+05:30 IST

పల్లె ప్రగతి స్ఫూర్తితో సరికొత్త అభివృద్ధి లక్ష్యాలతో రూపొందించిన ‘పట్టణ ప్రగతి’ లక్ష్యానికి దూరంగా

లక్ష్యానికి దూరంగా ‘పట్టణ ప్రగతి’

యాదాద్రి రూరల్‌, భూదాన్‌పోచంపల్లి: పల్లె ప్రగతి స్ఫూర్తితో సరికొత్త అభివృద్ధి లక్ష్యాలతో  రూపొందించిన ‘పట్టణ ప్రగతి’ లక్ష్యానికి దూరంగా            నిలిచిందనే చెప్పాలి. మున్సిపల్‌ పాలకవర్గాలు ఏర్పడ్డాక చేపట్టిన తొలి కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయింది. కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అంతగా లేకపోయినా స్థానిక కౌన్సిలర్లు, సంబంధిత  అధికారులతో మమ అనిపించారు. 


గుట్ట మున్సిపల్‌ పరిధిలోని సమస్యలను మూడు రకాలుగా గుర్తించారు. తక్షణమే పరిష్కరించాల్సినవి, తాత్కాలికమైనవి, దీర్ఘకాలికమైన సమస్యలుగా గుర్తించారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో మురికి కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగింపు, ఖాళీ ప్రదేశాల్లో మురికి, కంపచెట్లును తొలగించి శుభ్రం చేయడం.  పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూడడం. తాత్కాలిక సమస్యలైన రోడ్లపై గుంతలు పూడ్చడం, తడి, పొడి చెత్త సేకరణకు ప్రతి ఇంటికి బుట్టల పంపిణీతో పాటు, శిథిలావస్థలోని విద్యుత్‌ స్థంబాలను తొలగించడం గుర్తించి వాటిని తాత్కాలికంగా నే పరిష్కరించారు. పట్టణంలో అండర్‌గ్రౌండ్‌ ప్రధాన సమస్యగా మారింది.


ఇది లేక పోవడంతో వీదుల్లో మురు గు పారుతూ దోమలు, ఈగలు వృద్ధిచెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రస్తుత వేసవిలో నీటి సమ స్య ప్రధానంగా మారనుంది. గతంలో అద్దెబోర్లు వినియోగించగా ప్రస్తుతం మిషన్‌ భగీరథ పైపుల్‌న్‌తో ఆ పరిస్థితి లేదు. మొక్కలు నాటడం సైతం రెండు వార్డులకే పరిమితమైంది. పట్టణంలో శిథిలావస్థకు చేరిన విద్యుత్‌ స్తంభా లు సుమారు 200వరకు  ఉండగా అందులో ఇప్పటి వర కు 50శాతం మాత్రమే కొత్తవి వేశారు. 


నిధులున్నా నిష్ప్రయోజనం

గతేడాది గుట్ట నూతన మున్సిపల్‌ అభివృద్ధిలో భాగం గా మురికికాల్వల నిర్మాణానికి టీయూఎ్‌ఫఐడీసీతోరూ.20 కోట్లు మంజూరవగా ఎన్నికల ముందు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. వాటిని ఇప్పటి వరకు ఆచరణలో పెట్టకపోవడంపై ప్రజ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 పోచంపల్లి మునిసిపాలిటీలో

 పోచంపల్లి మున్సిపల్‌ కేంద్రంలోని బీసీ కాలనీలో కప్పు లేకుండా మ్యాన్‌హోల్‌ రోడ్డు మధ్యలో ఉండి తరుచూ ప్ర మాదాలు జరుగుతున్నాయి.  మరో మ్యాన్‌హోల్‌ ఇనుప సీకులు తేలి అనేకమంది ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నా పట్టింపు కరువైంది. పట్టణంలోని ఏకలవ్య వీధిలోని రోడ్డుకు మధ్య పెద్ద చెట్టు ఉండడంతో రాత్రిపూట ఆ దారిగుండా వెళ్లే వాహనదారులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దాన్ని తొలగించాలని స్థానిక నాయకుడు బిజిలి కుమారస్వామి ఎన్నిమార్లు విన్నవించినా అధికారు లు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. అంతేగాక ప్రధానరహదారికి ఇరువైపులా డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని నాలుగో వార్డులోని ఇందిరానగర్‌ కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఉన్న మూసీ కాల్వ పై స్లాబ్‌ కూ లింది.


రోడ్డు మీద పెద్ద గుంత ఉంది. ఈప్రాంతంలోని చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్లి తరుచూ గుంతలో పడి ప్ర మాదాలకు గురవుతున్నారు. బైకులపై వచ్చే వాహనదారులకు ఇబ్బందిగా మారిందని, ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణం లో పారిశుధ్యం సైతం లోపించింది. ఇప్పటికైనా మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలోనై నా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 






Updated Date - 2020-03-13T12:06:45+05:30 IST