యాదాద్రిలో వైభవంగా ఊంజల్‌సేవోత్సవం

ABN , First Publish Date - 2020-10-03T10:44:54+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది.

యాదాద్రిలో వైభవంగా ఊంజల్‌సేవోత్సవం

యాదాద్రి టౌన్‌, అక్టోబరు 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్రం కలకళలాడింది. హరిహరులను దర్శించుకున్న భక్తులు మొక్కు టెంకాయలు సమర్పించి యాత్ర పూర్తి చేసుకున్నారు. కాగా యాదాద్రీశుడి సన్నిధిలో స్వామికి  సువర్ణ పుష్పార్చనలు, ఆండాల్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవా పర్వాలు నేత్రపర్వంగా సాగాయి. బాలాలయంలో ప్రతిష్టాలంకారమూర్తులను సువర్ణ పుష్పాలతో అర్చించిన అర్చకులు ఉత్సవమూర్తులను అభిషేకించి అర్చించారు. పాతగుట్ట ఆలయంలోనూ స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాల్‌ అమ్మవారికి ఊంజల్‌సేవోత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. స్వామికి శుక్రవారం భక్తుల నుంచి 5లక్షల 21వేల 494 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. ఆగా యాదాద్రి క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్‌ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆయనకు అర్చకులు ఆలయ మార్యాదలతో స్వాగతం పలికారు.  

Updated Date - 2020-10-03T10:44:54+05:30 IST