టీఏపీఆర్‌పీఏ రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు
ABN , First Publish Date - 2020-02-27T12:20:08+05:30 IST
తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ (టీఏపీఆర్‌పీఏ) రాష్ట్ర కమిటీలో ఇద్దరు జిల్లా వాసులకు చోటు
భువనగిరి టౌన్, ఫిబ్రవరి 26: తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ (టీఏపీఆర్‌పీఏ) రాష్ట్ర కమిటీలో ఇద్దరు జిల్లా వాసులకు చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎల్.అరుణమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బొమ్మకంటి బాలరాజు ఎన్నికయ్యారు.
ఈనెల 24,25 తేదీలలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర మహాసభలో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం భువనగిరిలో జరిగిన సమావేశంలో వారిని అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో అసొసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాసరి అంజయ్య, ఉపాధ్యక్షులు కాచరాజు జయప్రకాశ్ రావు పాల్గొన్నారు.