టీఆర్‌ఎస్‌ పతనం ఆరంభం : తీన్మార్‌ మల్లన్న

ABN , First Publish Date - 2020-12-11T06:14:39+05:30 IST

ప్రజా పాలనను విస్మరించిన టీఆర్‌ఎస్‌ పార్టీ పతనం ఆరంభమైందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మా ర్‌ మల్లన్న అన్నారు.

టీఆర్‌ఎస్‌ పతనం ఆరంభం : తీన్మార్‌ మల్లన్న
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తీన్మార్‌ మల్లన్న

మిర్యాలగూడటౌన్‌, డిసెంబరు 10: ప్రజా పాలనను విస్మరించిన టీఆర్‌ఎస్‌ పార్టీ పతనం ఆరంభమైందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మా ర్‌ మల్లన్న అన్నారు. గురువారం ఆయన మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి 1200మంది ప్రాణాలర్పిస్తే రక్తం చుక్క చిందించకుండా గద్దెనెక్కిన సీఎం కేసీఆర్‌ ఫాంహౌ్‌సకే పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్‌ కంటికి పొరలు కమ్మడంతో అనాలోచిత నిర్ణయాలు, నిరంకుశ వైఖరితో తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చాడన్నారు. సీఎం నిరంకుశ పాలనతో విసిగి వేసారిన ప్రజలు ఖబడ్దార్‌ కేసీఆర్‌ అనే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్‌ సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గాలకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని వదిలేయగా ఉత్సవ విగ్రహాలుగా మారిన మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పా ల్పడుతున్నారన్నారు. పటాన్‌చెరువు ఎమ్మెల్యే విలేకరిని బూతులు తిట్టిన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజలెవరూ ఓట్లు వేయరని, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలే వస్తాయన్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా పేరొందిన మిర్యాలగూడ ప్రాంతంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, స్థానిక ఆర్డీవో కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రజా సమస్యలు విస్మరించిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రశ్నించే గొంతుకను పట్టభద్రులు గెలిపించాలని కోరారు.

Updated Date - 2020-12-11T06:14:39+05:30 IST