టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత
ABN , First Publish Date - 2020-12-01T12:16:49+05:30 IST
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు.
నల్లగొండ: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. 1956 జనవరి 9న నోముల జన్మించారు. 2014లో సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జానారెడ్డిపై విజయం సాధించారు. 1999, 2004లో నకిరేకల్ ఎమ్మెల్యేగా నోములు గెలుపొందారు. నోముల నర్సింహయ్య మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.