ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఇక భారీగా..
ABN , First Publish Date - 2020-11-27T05:55:16+05:30 IST
మునిసిపాలిటీలకు ఆదాయమే లక్ష్యంగా ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో భారీ సంస్కరణలకు మునిసిపల్ పరిపాలనా శాఖ తెరలేపింది. ఈ క్రమంలో లైసెన్స్‌ల జారీలో కేటగిరీల విధానాన్ని అమలు చేస్తూ ఫీజులను భారీగా పెంచింది. ప్రస్తుతానికి నూతన లైసెన్స్‌ల జారీకే ఈ విధానం అమలు చేస్తుండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి పాత వాటి రెన్యువల్‌కు కూడా వర్తింపజేయనుంది.

విస్తీర్ణం, ప్రాంతాల ఆధారంగా నిర్ధారణ
మునిసిపాలిటీలకు పెరగనున్న ఆదాయం
భువనగిరి టౌన్, నవంబరు 26: మునిసిపాలిటీలకు ఆదాయమే లక్ష్యంగా ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో భారీ సంస్కరణలకు మునిసిపల్ పరిపాలనా శాఖ తెరలేపింది. ఈ క్రమంలో లైసెన్స్‌ల జారీలో కేటగిరీల విధానాన్ని అమలు చేస్తూ ఫీజులను భారీగా పెంచింది. ప్రస్తుతానికి నూతన లైసెన్స్‌ల జారీకే ఈ విధానం అమలు చేస్తుండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి పాత వాటి రెన్యువల్‌కు కూడా వర్తింపజేయనుంది. ఉమ్మడి జిల్లాలో 17 మునిసిపాలిటీలు ఉండగా, ఇప్పటివరకు సుమారు 8వేల ట్రైడ్ లైసెన్స్‌లు ఉన్నాయి. దీంతో ఏటా రూ.10లక్షల లోపే లైసెన్స్ ఫీజుల రూపంలో మునిసిపాలిటీలకు ఆదాయం సమకూరుతోంది. కాగా, నూతన విధానంలో పట్టణాల్లో వ్యాపారాలు నిర్వహించే అన్నిస్థాయిల వ్యాపారులు విధిగా ట్రేడ్ లైసెన్స్ పొందనుండటంతో లైసెన్స్‌ల సంఖ్యతోపాటు ఆదాయం గణనీయంగా పెరగనుంది.
నూతన విధానంలో ఇలా..
నూతన విధానంలో నాలుగు కేటగిరీలుగా ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. దుకాణాలు, కార్యాలయాల విస్తీర్ణం మేరకు చదరపు గజాల చొప్పున రోడ్లు, ప్రాంతాల వారీగా లైసెన్స్ ఫీజును నిర్ధారిస్తారు. ప్రస్తుతం రూ.500 నుంచి రూ.5వేల వరకు ట్రైడ్ లైసెన్స్ ఫీజును మునిసిపాలిటీలు వసూలు చేస్తున్నాయి. నూతన విధానంలో దుకాణాలు, కార్యాలయాల విస్తీర్ణం మేరకు బడా వ్యాపారులు లక్షల రూపాయలు, మధ్యతరగతి వ్యాపారులు కూడా వేలాది రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మాన్యువల్ విధానంలో ఉన్న లైసెన్స్ జారీ, ఫీజు వసూలును భవిష్యత్తులో ఆన్‌లైన్ చేయనున్నారు. దీంతో అక్రమాలు తగ్గనున్నాయి.
కేటగిరీలుగా లైసెన్స్‌లు
ట్రేడ్ లైసెన్స్‌లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఒకటి ప్రమాదాలకు అస్కారం ఉండే ట్రేడర్లు, రెండు సాధారణ వ్యాపారాలు, కార్యాలయాలు, మూడు పరిశ్రములు, నాలుగు తాత్కాలిక ట్రేడర్లుగా విభజించారు. దుకాణాలు ఉన్న ప్రాంతాల్లో రహదారుల విస్తీర్ణాన్ని సైతం లైసెన్స్ జారీలో పరిగణనలోకి తీసుకుంటారు. పరిశ్రమలకు మాత్రం చిన్నతరహా, భారీ తరహా కేటగిరీలను పరిగణనలోకి తీసుకుంటారు. తాత్కాలిక లైసెన్్స నిబంధనల ఆధారంగా నిర్దేశిత వ్యవధి వరకు చెల్లుబాటయ్యేలా జారీ చేస్తారు.
ఫీజులు ఇలా(చదరపు గజానికి)..
కేటగిరీ సింగిల్ లేన్ డబుల్ లేన్ మల్టిపుల్ లేన్
రోడ్డు(20ఫీట్లు) (30 ఫీట్లు) (30 ఫీట్లు)
ప్రమాదాలకు ఆస్కారం ఉండే ట్రేడర్లకు రూ.3 రూ.4 రూ.5
సాధారణ వ్యాపారాలు, కార్యాలయాలు రూ.3 రూ.4 రూ.5
స్టార్ హోటళ్లు, కార్పొరేట్ ఆస్పత్రులు - - రూ.6
పరిశ్రమలకు చిన్న, మధ్య, భారీ తరహా ఆధారంగా చదరపు గజానికి రూ.4 నుంచి రూ.7వరకు ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారు.
తాత్కాలిక ట్రేడర్లు అంటే సీజనల్ వ్యాపారాలు చేసేవారు కూడా ఇక నుంచి తప్పనిసరిగా తాత్కాలిక లైసెన్స్ తీసుకోవాలి. వీరు నిర్వహించే వ్యాపారం, వ్యవధి, ప్రాంతం ఆధారంగా లైసెన్స్ ఫీజును నిర్ణయిస్తారు.