రూ.కోటితో టౌన్‌హాల్‌ నిర్మాణం

ABN , First Publish Date - 2020-12-18T05:20:01+05:30 IST

చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూర్బన్‌ మిషన్‌ పథకం కింద టౌన్‌హాల్‌ నిర్మాణానికి రూ.కోటి మంజూరయినట్లు డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌ రెడ్డి తెలిపారు.

రూ.కోటితో టౌన్‌హాల్‌ నిర్మాణం
సమీక్షలో పాల్గొన్న ఉపేందర్‌రెడ్డి, వెన్‌రెడ్డి రాజు

చౌటుప్పల్‌ టౌన్‌, డిసెంబరు 17: చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూర్బన్‌ మిషన్‌ పథకం కింద టౌన్‌హాల్‌ నిర్మాణానికి రూ.కోటి మంజూరయినట్లు డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌ రెడ్డి తెలిపారు. మునిసిపాలిటీ కార్యాలయంలో గురువారం చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు అధ్యక్షతన రూర్బన్‌ నిధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ టౌన్‌హాల్‌తోపాటు డంపింగ్‌ యా ర్డు, గొర్రెలు, మేకల మార్కెట్ల నిర్మాణానికి రూర్బన్‌ మిషన్‌ కింద నిధులు మంజూరయ్యాయన్నారు. సమీక్షలో రామదుర్గారెడ్డి పాల్గొన్నారు.  

  

Updated Date - 2020-12-18T05:20:01+05:30 IST