సాగర్‌లో పర్యాటకుల సందడి
ABN , First Publish Date - 2020-12-28T05:52:43+05:30 IST
వరుసగా సెలవులు రావడంతో నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్ అందాలను తిలకించడానికి రాష్ట్ర నలుమూలాల నుంచి పర్యాటకులు రావడంతో సాగర్‌లో సందడి నెలకొంది.

లాంచీ దిగి వస్తున్న పర్యాటకులు
నాగార్జునసాగర్, డిసెంబరు 27: వరుసగా సెలవులు రావడంతో నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్ అందాలను తిలకించడానికి రాష్ట్ర నలుమూలాల నుంచి పర్యాటకులు రావడంతో సాగర్‌లో సందడి నెలకొంది. హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి పర్యాటకశాఖ అధికారులు జలాశయంలో జాలీ లాంచీ ట్రిప్పులను తిప్పారు. నాలుగు ట్రిప్పులు నడిపినట్లు అధికారులు తెలిపారు.