నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-09-13T09:38:26+05:30 IST

దేశంలో అద్భుత ఆలయంగా పునర్నిర్మితమవుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం సందర్శించనున్నారు.

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనుల పరిశీలన

తొమ్మిది మాసాల తర్వాత 13వసారి పర్యటన

సీఎం పర్యటనకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు


(ఆంధ్రజ్యోతి , యాదాద్రి): దేశంలో అద్భుత ఆలయంగా పునర్నిర్మితమవుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం సందర్శించనున్నారు. ఆదివా రం ఉదయం 10 గంటలకు రోడ్డుమార్గంలో హైదరాబాద్‌ నుంచి బయల్దేరి నేరుగా యాదా ద్రి కొండపైకి చేరుకుంటారు. కొండపై బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాల యం, పరిసరాల్లో పనుల పురోగతిని పరిశీలించనున్నారు. సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టా క 2014 సెప్టెంబరు 17న తొలిసారిగా యాదా ద్రి ఆలయాన్ని కేసీఆర్‌ సందర్శించి ఇక్కడి అభివృద్ధికి సంకల్పించారు. మొత్తం ఇప్పటి వరకు 12మార్లు యాదాద్రిని ఆయన పర్యటించారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సీఎం 13వ సారి ఇక్కడికి వస్తుండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.


అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా యా దాద్రి ఆలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. సుమారు ఐదేళ్లుగా కొనసాగుతున్న పనులు నూరుశాతం పూర్తి చేసి ఆలయ ఉద్ఘాటనకు సంసిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఆదివారం పర్యటనలో ఆలయ పనులు, పరిసరాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులపైనే ఎక్కుగా దృష్టి సారించే అవకాశం ఉంది. కొండపైన, కొండకిం ద రహదారుల అభివృద్ధి, భక్తులకు వసతి సదుపాయాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం ఆదివారం ఉదయం 10గంటలకు హై దరాబాద్‌ నుంచి 11 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. తొలుత బాలాలయంలో స్వామివారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంత రం కొండపై ప్రధానాయల పనులను పరిశీలిస్తారు.


కొండపై శివాలయం, పుష్కరిణి, ప్రసాదాల తయారీ భవనంతో పాటు తిరువీధుల్లో ఫ్లోరింగ్‌, పచ్చదనం పనుల పురోగతిని చూస్తారు. ప్రధానాలయం లోపల, బయట అనుకున్నవిధంగా, ఆలయ వైదిక, ఆగమ శాస్త్రాల ప్రకారం జరిగాయా లేదా అని పరిశీలించే అవకాశం ఉంది. సుదీర్ఘ విరామం తొమ్మిది మాసాల తర్వాత సీఎం పర్యటన ఖారారు కావడంతో వైటీడీఏ, అధికారులు, స్థపతులు ఆలయ నిర్మాణ పనులపై అంతర్గత సమీక్షించారు. కొండపై ఆలయ పరిసరాల్లో సీఎం పరిశీలించే ప్రాంతాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సరిదిద్దుతున్నారు.

 

చేపట్టాల్సిన పనులపై సమీక్ష

యాదాద్రి ఉద్ఘాటన నాటి కి పనుల పూర్తిపైనే సీఎం కేసీఆర్‌ ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంది. ఆలయ ఉద్ఘాటన సందర్భంగా స్వామి సన్నిధిలో మహాసుదర్శన యాగం చేపట్టనుండటంతో అందుకు అనుగుణంగా పనులు ఏమేరకు పూర్తి చేశారో సీఎం పరిశీలించనున్నారు. ఇప్పటికే ప్రధానాలయ ప్రాకార సప్తగోపుర, ముఖమండపాలు, గర్భాలయంతో పాటు ఉపఆలయాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయ ద్వారాలకు బంగా రు తొడుగుల అమరిక, విద్యుదీకరణ, డ్రైన్‌ పనులు కొనసాగుతున్నాయి. అష్టభుజి ప్రాకార అంతర్‌ దిశ గా మహాబలిపురం నుంచి తెచ్చిన ఐరావతాలు, సింహాలు, శంఖు, చక్రనామాల విగ్రహాల అమరిక పనులు చేపట్టాల్సి ఉంది.


అద్దా ల మండపం, ప్రాకార మండపం పైకప్పులపై వర్షపు నీరు లీకేజీ ఉండకుండా డంగుసున్నంతో పాటు మాఢవీధుల్లో ఫ్లోరింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. కొండపై ప్రధాన శివాల యం, ఉపఆలయ పనులు పూర్తికాగా, ప్రాకార మండపాలకు, గోపురాలకు దేవతా విగ్రహాలు అమర్చే పనులు ప్రారంభం అయ్యాయి. కొండపైన, కింద పుష్కరిణి పనులు సాగుతున్నాయి. కొండచుట్టూ రింగురోడ్డు పనులు వేగవంతం చేశారు. పట్టణంలో రోడ్డు విస్తరణకు భూసేకరణ కోసం నిర్వాసితులతో రెవెన్యూ అధికారులు చర్చిస్తున్నారు. వీవీఐపీల వసతి కోసం చేపట్టిన ప్రెసిడెన్షియల్‌ సూట్లలో ఇంటీరియర్‌, విద్యుదీకరణ పనులు సాగుతున్నాయి. కాగా, ప్రస్తుతం ఆలయం, పరిసరాల్లో జరిగిన పనుల పురోగతి, పూర్తిస్థాయిలో పూర్తికి ఎన్ని రోజులు పడుతుందనే అంశాలను సీఎం కేసీఆర్‌ స్వయంగా పరిశీలించి, అధికారులతో సమీక్షించి, ఆలయ ఉద్ఘాటన ముహూర్తంపై సూత్రప్రాయంగా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.


సీఎం పర్యటనకు ఏర్పాట్లు 

సీఎం కేసీఆర్‌ యాదాద్రికి రానుండటంతో రెండు రోజులుగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వైటీడీఏ, జిల్లా అధికార యంత్రాంగం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ప్రధానాలయం, ప్రాకార మండపాలు, తిరువీధుల పరిసరాలను శుభ్రం చేశారు. పట్టణంలో రహదారుల విస్తరణ, కొండచుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణం పనులతో పాటు భూసేకరణపై రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు సమీక్షించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ పరిశీంచి పలు సూచనలు చేశారు. సీఎం రోడ్డుమార్గంలో రానుండటంతో డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్లు ముమ్మరంగా తనిఖీలు చేశాయి. ఆలయ ఘాట్‌రోడ్డు, ప్రధాన రహదారులను మట్టితో చదును చేశారు. కొండపైన పుష్కరిణి సమీపంలో శివాలయం ఎదుట రహదారి నిర్మాణం చేశారు.

Updated Date - 2020-09-13T09:38:26+05:30 IST