నేడు నర్సింహయ్య సంతాప సభ

ABN , First Publish Date - 2020-12-27T05:39:26+05:30 IST

నాగార్జునసాగర్‌ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సంతాప సభ ఈనెల 27న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించేందుకు యాదవ సంఘం భారీ ఏర్పాట్లు పూర్తిచేసింది.

నేడు నర్సింహయ్య సంతాప సభ
ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న యాదవ సంఘం నేతలు

భారీ ఏర్పాట్లు చేసిన యాదవ సంఘం

నల్లగొండ, డిసెంబరు 26: నాగార్జునసాగర్‌ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సంతాప సభ ఈనెల 27న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించేందుకు యాదవ సంఘం భారీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సందర్భంగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్దన్‌యాదవ్‌ మాట్లాడుతూ, 10వేల మందితో సభ నిర్వహిస్తామని తెలిపారు. సభకు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తోపాటు సంఘం రాష్ట్ర నేతలు, అరుణోదయ విమలక్క, వందేమాతరం శ్రీనివాస్‌ హాజరవుతారని తెలిపారు. పార్టీలకు అతీతంగా జిల్లాలోని యాదవ ప్రజాప్రతినిధులు, బీసీ, యువజన సంఘాలు ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2020-12-27T05:39:26+05:30 IST