మరో మూడు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-15T10:11:41+05:30 IST

సూర్యాపేట జిల్లాలో మరో మూడు కరోనా కేసులు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.

మరో మూడు పాజిటివ్‌

సూర్యాపేట జిల్లాలో 23కు చేరిన కేసుల సంఖ్య


సూర్యాపేట, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి)/తిరుమలగిరి: సూర్యాపేట జిల్లాలో మరో మూడు కరోనా కేసులు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తి కుమారుడికి, మార్కెట్‌రోడ్‌లో దుకాణ యజమానికి, తిరుమలగిరి మునిసిపాలిటీలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 15 రోజుల క్రితం జరిగిన రెండు విందులకు చాలా మంది హాజరయ్యా రు. ఈ విందులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి హాజరవగా, అతడి నుంచి ఒక్కొక్కరికి వ్యాప్తి చెందుతూ వస్తోంది. ఇప్పటికే పలువురిని అధికారులు గుర్తించి ప్రభుత్వ క్వారంటై న్‌, హోంక్వారంటైన్‌లో ఉంచినా అక్కడక్కడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొంత మందికి కరోనా లక్షణాలు లేకున్నా రిపోర్టులు పాజిటివ్‌ వస్తుండటంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


జిల్లాలో వైరస్‌ వ్యాప్తి రెండో దశ దాటితే ప్రమాదకరమని, ఈ నేపథ్యంలో ఎవరూ ఇంటిని విడిచి బయటికి రావద్దని వైద్యులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండల పరిధిలోని మట్టపల్లి, రాంచంద్రాపురం గ్రామాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. పలువురి అనుమానితుల స్వాప్‌ నమూనాలను పరీక్షలకు పంపారు. కాగా, ఇటీవల 80 మంది స్వాప్‌ నమూనాలను హైదరాబాద్‌కు పంపగా మంగళవారం 77 మందికి నెగిటివ్‌, ముగ్గురికి పాజిటివ్‌ ఇచ్చింది.


రెండు రోజులుగా మరో 80 మంది స్వాప్‌ నమూనాలు పంపగా, వాటి ఫలితాలు రావాల్సి ఉంది. తిరుమలగిరి మునిసిపాలిటీలో రెండో కరోనా కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో 11వ వార్డులో ఒకరికి పాజిటివ్‌ రాగా, అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ అ!ధికారులు గుర్తించి క్వారెంటైన్‌ తరలించి స్వాప్‌ నమూనాలను పరీక్షలకు పంపారు. వారిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-04-15T10:11:41+05:30 IST