బ్యాంకును మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-27T05:30:00+05:30 IST

తప్పుడు పత్రాలతో బ్యాంకును మోసం చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

బ్యాంకును మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్టు

అనంతగిరి, డిసెంబరు 27: తప్పుడు పత్రాలతో బ్యాంకును మోసం చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తీసు కున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో అసలు విషయం బయటప డింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరిని శనివారం కోదాడ పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరిపారు. నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామం శివారులో ఏర్పాటు అయిన రైస్‌మిల్లు పేరుతో మాజీ ప్రజాప్రతినిధితో పాటు కోదాడ, మిర్యాలగూడెం, నల్లగొండ ప్రాంతాలకు చెందిన కొందరు కోదాడలోని ఓ బ్యాంకు నుంచి రూ.2 కోట్లు రుణం తీసుకున్నారు. వరి పొట్టు, తవుడు బస్తాలను, ధాన్యం బస్తాలుగా చూపించి బ్యాంకుకు కుచ్చు టోపి పెట్టారు. ఆ అప్పు చెల్లించకపోవటంతో ఆడిట్‌లో అసలు విషయం వెలుగుచూసింది. దాదాపు 7,8ఏళ్ల క్రితం జరిగిన ఈ ఉదాం తంపై అప్పట్లోనే బ్యాంకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా అరెస్టు వారెంట్‌తో కోదాడ పోలీసులు రంగంలోకి దిగి, రుణ గ్రహీతలను అరెస్టు చేసి, డీఎస్పీ, విచారణ జరిపారు. 

Updated Date - 2020-12-27T05:30:00+05:30 IST