వ్యవసాయ చట్టాలతో నష్టం లేదు
ABN , First Publish Date - 2020-12-28T05:24:41+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు
నూతన్‌కల్ డిసెంబరు 27: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం విలేకరుల తో మాట్లాడారు. చట్టాలు వచ్చినా రైతులు పండించిన పంటలను మార్కెట్‌లో అమ్ముకోవచ్చన్నారు. ఈ సమావేశంలో నాయకులు కాప రవికుమార్, అబీజ్, మద్ది సంజీవరెడ్డి, సోమలింగయ్య తదితరులు పాల్గొన్నారు.