భగీరథ నీటిలో కలుషితాలు లేవు: జలజీవన్ బృందం
ABN , First Publish Date - 2020-12-15T05:40:30+05:30 IST
మిషన్ భగీరథ నీటిలో కలుషితాలు ఏవీ లేవని జలజీవన్ మిషన్ కేంద్ర బృంద సభ్యులు అన్నారు.
నడిగూడెం, డిసెంబరు 14: మిషన్ భగీరథ నీటిలో కలుషితాలు ఏవీ లేవని జలజీవన్ మిషన్ కేంద్ర బృంద సభ్యులు అన్నారు. మండలంలోని వల్లపురంలో బృంద సభ్యులు పర్యటించి 15 ఇళ్లలోని నీటి శాంపిల్స్‌ను సోమవారం సేకరించారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటి పరిమాణాన్ని, సాంద్రతను, నత్రజని, బాస్వరం, క్లోరైడ్, ఫ్లోరిన్, అమోనియం, తదితర నీటిశాతాలను పరీక్షించారు. స్థానిక పంచాయతీ ఆవరణలో నీటి శాంపిల్స్ నాణ్యత ఫలితాలను గ్రామస్థుల ఎదుట ప్రదర్శించారు. కార్యక్రమంలో బృంద సభ్యులు శ్రావన్, భిక్షమయ్య, ఇంట్రా డీఈ దేవభిక్షం, జేఈ ఎండీ ఇర్ఫాన్, గ్రిడ్ డీఈ అభినయ్, ఏఈ అనిల్‌నాయక్, సర్పంచ్ వట్టికూటి చంధ్రయ్య, కార్యదర్శి అనిల్‌కుమార్, ల్యాబ్ టెక్నిషన్లు బాలకృష్ణ, వినోద్, దేవయ్య, హుస్సేన్, వీరబాబు, ప్రదీప్, జానీ తదితరులు ఉన్నారు.
కోదాడ రూరల్: మిషన్ భగీరథ మంచినీటిని తాగడానికి వినియోగించాలని జాతీయ జలజీవన్ మిషన్ బృందం సభ్యులు బిక్షమయ్య, శ్రావణ్ సూచించారు. గణపవరంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో నీటిని సోమవారం పరీక్షించి, మాట్లాడారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈఈ దేవబిక్షం, ఏఈ రవి, గ్రిడ్ ఏఈ సిద్ధార్ధ, సర్పంచ్ విజయ్‌కిరణ్, కార్యదర్శి మునవర్ పాషా పాల్గొన్నారు.