జిల్లాలో 301 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ABN , First Publish Date - 2020-10-13T07:38:28+05:30 IST

వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోలుకు త్వరలో జిల్లాలో 301 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో సోమవారం

జిల్లాలో 301 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

సూర్యాపేట(కలెక్టరేట్‌), అక్టోబరు 12 : వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోలుకు త్వరలో జిల్లాలో 301 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌  టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సీజన్‌లో జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలలో పంట సాగు చేశారని ; ధాన్యం దిగుబడి దాదాపు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతుల నుంచి విక్రయానికి దాదాపుగా 6లక్షల66వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఆ దిశగా ఏర్పాట్లుచేయాలని సూచించారు. ధాన్యంలో తేమ లేకుండా,  బాగా తూర్పారబట్టేలా రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఐకేపీ ద్వారా 193, పీఏసీఎ్‌సల ద్వారా 103, మార్కెటింగ్‌ శాఖ ద్వారా 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గన్నీసంచుల కొరత ఉంటే ముందుగానే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో పీడీ కిరణ్‌కుమార్‌, డీసీవోఎస్‌ ప్రసాద్‌, డీఎ్‌సవో విజయలక్ష్మి, మార్కెటింగ్‌ డీఎం సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T07:38:28+05:30 IST