కనపడని శత్రువు కరోనా

ABN , First Publish Date - 2020-03-28T11:03:48+05:30 IST

కరోనా వైరస్‌ కనపడని శత్రువుగా విజృంభిస్తోందని, అప్రమత్తతతోనే దానిని ఎదుర్కోవాలని మంత్రి గుంటకండ్ల

కనపడని శత్రువు కరోనా

 సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి

వీధులు, కార్యాలయాల్లో అగ్ని మాపక యంత్రాలతో రసాయనాల పిచికారీ


సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 27: కరోనా వైరస్‌ కనపడని శత్రువుగా విజృంభిస్తోందని, అప్రమత్తతతోనే దానిని ఎదుర్కోవాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డిలో కలిసి పర్యటించారు. మునిసిపాలిటీ ఆఽధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణ పిచికారీని పరిశీలించి మాట్లాడారు.


జిల్లా ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసర విభాగాల్లో విఽఽధులు నిర్వహించే సిబ్బంది విధిగా ఐడీ కార్డులు వెంట ఉంచుకోవాలన్నారు. అత్యవసర సేవలందించే వారి విషయంలో పోలీసులు మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ కిశోర్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ భూక్యా సంజీవనాయక్‌, మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, డీఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-28T11:03:48+05:30 IST