ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-03-02T11:41:55+05:30 IST

గ్రామాలకు ప్రభు త్వం అందించిన ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాల ని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే

ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలి

భూదాన్‌పోచంపల్లి, మార్చి 1 : గ్రామాలకు ప్రభు త్వం అందించిన ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాల ని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కనుముకుల గ్రామ పంచాయతీ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను ఆదివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ఈ ట్రాక్టర్‌ను ఉపయోగించుకోవాలన్నారు.


గ్రామంలో నాటిన మొక్కలతో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలన్నారు.  స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడంలో గ్రామస్థులందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత-మల్లారెడ్డి, సర్ప ంచ్‌ కోట అంజిరెడ్డి,  పోచంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీ, పీఏసీఎస్‌  చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, డైర్టెక్టర్‌ కూసుకుంట్ల అలివేలు-కొండల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నా యకులు రావుల శేఖర్‌రెడ్డి, పగిళ్ల సుధాకర్‌రెడ్డి, ముత్యా ల మహిపాల్‌రెడ్డి, ఆయా గ్రామా ల సర్పంచ్‌లు పగిళ్ల స్వప్న-రాంరెడ్డి, పక్కీరు లావణ్య-దేవేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు బత్తుల మాధవి-శ్రీశైలంగౌడ్‌, రావుల శ్రీదేవి-శేఖర్‌రెడ్డి, చిల్లర జంగయ్యయాదవ్‌, నాయకులు మట్టిపల్లి అయిలయ్యయాదవ్‌, కోట లక్ష్మారెడ్డి, కోట సత్తిరెడ్డి, చుక్క వెంకటేశం పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T11:41:55+05:30 IST