పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
ABN , First Publish Date - 2020-08-10T11:01:59+05:30 IST
పరిసరాలను శుభ్రం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కోరారు.
దేవరకొండ/ హాలియా, ఆగస్టు 9: పరిసరాలను శుభ్రం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కోరారు. తన క్యాంపు కార్యాల యంలో ఆదివారం నీటిసంపును శుభ్రం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హాలియాలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నీలిమా మహేందర్‌రెడ్డి, మునిసిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.